Wednesday, May 1, 2024

15 వైన్స్ లకు 182 దరఖాస్తులు దాఖలు.. అర్రురు ఒక వైన్స్ కే 34 దరఖాస్తులు

మోత్కూర్, (ప్రభ న్యూస్) : మోత్కూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని 5 మండలాల్లోని 15 మద్యం దుకాణాలకు గాను మొత్తం 182 దరఖాస్తులు దాఖలైనట్లు ఎక్సైజ్ సి ఐ సిహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. కేవలం ఇవ్వాల (శుక్రవారం) 63 దరఖాస్తులు దాఖలు కాగా, అంతకుముందు వారం రోజుల్లో 119 దరఖాస్తులు వచ్చినట్లు సి ఐ తెలిపారు . వలిగొండ మండలం అరూరు (షాప్ నెంబర్ 80) మద్యం దుకాణానికి ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో అత్యధికంగా 34 దరఖాస్తులు వచ్చాయి.

మోత్కూర్ లో 4 దుకాణాలకు గాను 2 దుకాణాలకు ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అడ్డగుడూర్ మండల కేంద్రంలోని 2 దుకాణాలకు గాను ఒక వైన్స్ కు 3, మరొక వైన్స్ కు 2 చొప్పున 5 దరఖాస్తులు వచ్చాయి .మోత్కూర్ అడ్డగూడూరు మండలాల్లోని 6 వైన్స్ లకు గాను మొత్తం 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

- Advertisement -

గుండాల మండలంలో 2 వైన్సులు ఎస్సీలకు రిజర్వు కాగా …ఇక్కడ కూడా పోటీ బాగానే ఉంది. ఓ వైన్స్ కు 17 ,మరో వైన్స్ కు 12 ,ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో 2 వైన్స్ లగాను ఒక వైన్స్ కు 16, మరొక వైన్స్ కు 19 దరఖాస్తులు, వలిగొండ మండల కేంద్రంలోని 4 మద్యం దుకాణాల్లో 22, 18 ,18 ,18 చొప్పున మొత్తం 66 దరఖాస్తులు వచ్చాయి. నేడు రెండో శనివారం కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లోని ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

శుక్రవారం దశమి మంచి రోజు కావడంతో ఒక్క రోజే సర్కిల్ పరిధిలో 15 దుకాణాలకు 63 దరఖాస్తులు వచ్చాయి. నేడు రెండో శనివారం, ఆదివారం, మంగళవారం పంద్రాగస్టు వరుసగా 3 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉండడంతో, శుక్రవారం అధిక సంఖ్యలో బ్యాంకుల్లో డీడీలు తీశారు. శనివారం, సోమవారం కూడా అధిక సంఖ్యలో దరఖాస్తులు పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement