Friday, May 3, 2024

HYD: రేపు రాత్రి నాగోల్, ఎల్బీనగర్ ఫ్లై ఓవర్లు బంద్

నాగోల్, డిసెంబర్ 30 (ఫ్రభ న్యూస్) : డిసెంబర్ 31న రాత్రి నాగోల్, ఎల్బీనగర్ ఫ్లై ఓవర్లు బంద్ కానున్నాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం తాగి రహదారులపై న్యూసెన్స్ సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ జీ.సుధీర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

ఫ్లెఓవర్లు, ఔటర్ రింగురోడ్డుపై కార్లు, ద్విచక్రవాహనాలు, ప్యాసింజర్ వాహనాలను డిసెంబరు 31న రాత్రి 10గంటల నుంచి జనవరి ఒకటో తేదీ ఉదయం 5గంటల వరకు అనుమతించమన్నారు. నాగోలు, కామినేని, LBనగర్, బైరామల్గూడ ఫ్లైఓవర్ తో పాటు LBనగర్, చింతల కుంట ROB మూసివేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement