Monday, October 18, 2021

మర్డర్‌ సిటీగా హైద‌రాబాద్‌

ప్రభ న్యూస్‌ బ్యూరో, గ్రేటర్‌ హైదరాబాద్‌, చాంద్రాయణగుట్ట: గ్రేటర్‌లో మారణహోమం సాగుతోంది. వ్యక్తిగత చంపుకొనేందుకు సైతం వెనకాడని పరిస్థి తులు కనిపిస్తున్నాయి. దీంతో ఏ రోజు ఎటువంటి దారుణం చోటుచేసుకుంటుందో తెలియని అయోమయ పరిస్థి తులు నగరవాసులను వెంటాడుతోంది. పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా, చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాలను హరిస్తోంది. ఈ తరహా ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత పటిష్ట ంగా విధులు నిర్వహించాల్సిన ఆవశ్యకతను పాతబస్తీ ఘటన చాటింది.

పాతబస్తీలో దారుణ హత్య
పాతబస్తీలో డబ్బుల విషయమై జరిగిన గొడవ ఓ వ్యక్తిని నడిరోడ్డుపై మారణాయుధాలతో వేటాడి దారుణంగా హత్యచేసేలా చేసింది. భయోత్పాతం సృష్టి ంచిన ఈ ఘటన బుధవారం సాయంత్రం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టే షన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట బార్కస్‌ ప్రాంతానికి చెందిన మృతుడు హమిద్‌ బిన్‌ జుబేది(40) చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే(వెస్ట ర్న్‌ యూనియన్‌ ఆఫ్‌ మనీ) షాపు నడిపిస్తున్నాడు. అయితే బుధవారం సాయంత్రం బండ్లగూడ ప్రధాన రహదారిపై కారులో హమిద్‌ బిన్‌ జుబేదీ వెళుతున్న తరుణంలో అతని కారును ఆపి దాడి చేసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ వర్మ సిబ్బందితో కలిసి ఘటనా స్థ లానికి చేరుకుని సంఘటనపై ఆరాతీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. క్లూస్‌ టీమ్‌ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

డబ్బుల విషయంలో జరిగిన హత్య : డీసీపీ గజరావు భూపాల్‌
చాంద్రాయణగుట్ట, బండ్లగూడ హాషామాబాద్‌లో సాయంత్రం హమీద్‌ బిన్‌ జుబేది అనే వ్యక్తిని దుండగులు హత్యచేసినట్లు సౌత్‌జోన్‌ డీసీపీ డాక్టర్‌ గజ రావు భూపాల్‌ తెలిపారు. బార్కస్‌ ప్రాంతానికి చెందిన ఆదిల్‌ జాబేరి, సయ్యిద్‌ జాబేరి, వాహిద్‌ జాబేరి ముగ్గురు అన్నదమ్ముళ్లని, హమీద్‌తో డబ్బుల విషయంలో గత కొద్దిరోజుల నుండి గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. హత్యకి ఈ ముగ్గురే కారణం కావచ్చని అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వీరి మధ్య వ్యాపారాల విషయంలో కూడా విబేధాలు ఉన్నాయని, డబ్బుల విషయంలో కోర్టులో కేసు కూడా ఉందని తెలిపారు. అనుమానమున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

ఘటనపై సీపీ అంజనీకుమార్‌ సీరియస్‌
పాతబస్తీలో దారుణ హత్య జరిగిన తీరుపై నగర సీపీ అంజనీ కుమార్‌ సీరియస్‌ అయ్యారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఎస్‌ఐ వెంకటేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ, ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన హమీద్‌, తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్‌ఐ వెంకటేశ్‌, ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఎస్‌ఐ వెంకటేశ్‌ను ఉన్నఫళంగా సస్పెండ్‌ చేస్తూ సీపీ చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News