Wednesday, May 1, 2024

NLG : న‌ల్లొండ జిల్లాలో యువ‌కుడి హ‌త్య

నల్లగొండ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు యువకుడ్ని కిరాతకంగా కత్తులతో నరికి హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో ఈ హ‌త్య‌లు చోటు చేసుకున్నాయి.

మృతుడు అదే గ్రామానికి చెందిన పోలెబోయిన మల్లేశ్‌గా గుర్తించారు. అర్ధరాత్రి ఇంట్లో చొరబడి మరీ హత్య చేసినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించా రు. పోస్టుమార్టం నిమిత్తం మల్లేశ్‌ మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement