Thursday, May 2, 2024

KHM: కల్వకుంట్ల కుటుంబాన్ని సాగనంపుదాం.. పొంగులేటి

ఇల్లందు: నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో వచ్చిన తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా భావిస్తున్న కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేసిందని, వారిని ఇంటికి పంపడమే మనందరి బాధ్యతని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు జగదాంబ సెంటర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాల కన్నీటి రోదనను చూసిన సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి లూటీ చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేసి తీరుతామని అన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య, చత్తీస్ ఘడ్ పీసీసీ అధ్యక్షులు దీపక్, జాతీయ ఎస్సీ సెల్ నాయకులు బెల్లయ్య నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, దొడ్డ డేనియల్, పులి సైదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement