Monday, April 29, 2024

Mrdchal – ఎన్నికల నియమావళి పాటించండి – రాజకీయ పార్టీలతో కలెక్టర్

ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ అక్టోబర్ 10: ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్​ కోడ్​) ఉల్లంఘించకుండా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ అన్నారు. ఎన్నికల కోడ్​ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల నియమావళి తదితర అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందం ఎల్లప్పుడూ పర్యటిస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అలాగే, సీ–విజిల్​ యాప్​ను వినియగించుకోవాలని, అన్ని రాజకీయ పార్టీల వారు తమ పార్టీల బూత్​ లెవల్​ ఏజెంట్లను నియమించుకోవాల్సిందిగా కలెక్టర్​ సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్​ విజయేందర్​రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వజ్రేష్ యాదవ్, సి.పి.ఐ జిల్లా అధ్యక్షులు సాయిలు గౌడ్, సి. ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు అశోక్ , టిడిపి, బి.ఎస్.పి ల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement