Monday, November 11, 2024

Motkuru – రాష్ట్రంలో రాక్షస పాలన… రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే – ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మోత్కూర్ ,నవంబర్ 9 (ప్రభ న్యూస్ ) తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వంలో గత 10 ఏండ్లుగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాక్షస పాలన కొలసాగుతుందని.. కుటుంబ పాలనను అంతమొందించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కనుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీకి విచ్చేసిన సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 10 ఏండ్లలో మోత్కూర్ లో కనీసం ఒక్క డబల్ బెడ్ రూమ్ కూడా రాలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కనీసం డీఎస్సీ కూడా వేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, ఉద్యోగులకు ,పెన్షనర్ లకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వని దుర్భర స్థితిలో ఉందని దుయ్యబట్టారు.

గతంలో 2 సార్లు టీఎస్పీఎస్సీ పరీక్ష రద్దయిందని, నిరుద్యోగురాలైన ప్రవల్లిక కేవలం టిఎస్పిఎస్సి లో ఉద్యోగం పొందలేకపోతున్నానే అవమానంతోనే మృతి చెందిందని, ప్రభుత్వం ప్రవల్లిక మృతికి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు .తుంగతుర్తిలో కాంగ్రెస్ టికెట్ ఉద్యమ నాయకునికి మాత్రమే కేటాయించనున్నట్లు ఏఐసీసీ అధిష్టానం చెప్పారన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి,తుంగతుర్తిలో కిషోర్ ఓటమి ఖాయమని సూర్యాపేట, తుంగతుర్తి లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని దీమా వ్యక్తం చేశారు.

. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పైళ్ల సోమిరెడ్డి ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు, మండల కాంగ్రెస్ నాయకులు ఫైల్ల నర్సిరెడ్డి, కారుపోతుల వెంకన్న, బద్దం నాగార్జున రెడ్డి, ఎండి సమీర్, మాజీ ఎంపిటిసి ముద్దం జయశ్రీ, మహిళా అధ్యక్షురాలు అన్నేపు పద్మ ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అవిశెట్టి కిరణ్, మోత్కూర్ సురేష్, ఎండి జావేద్, పట్టూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement