Tuesday, April 30, 2024

HYD: రాజకీయ నాయకులు అపరిష్కృతమైన సమస్యలను పరిష్కరించాలి…

హైదరాబాద్ : రాజకీయ నాయకులు తమ ప్రచారాలలో ఈ అపరిష్కృతమైన అవసరాన్ని తప్పక పరిష్కరించాలని న్గువు చేంజ్‌ నాయకులు అంజు అరోరా, దివ్య రాజేశ్వరి వుపద్రస్తా కోరారు. నవంబర్‌ 30న తెలంగాణ, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, న్గువు చేంజ్‌ నాయకులు అంజు అరోరా, దివ్య రాజేశ్వరి వూపద్రస్తా ప్రారంభించిన ఆన్‌లైన్‌ పిటిషన్ల పై చర్చ మొదలైంది. అనేక మంది సామాజిక కార్యకర్తల మాదిరిగానే, వారు కూడా అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు తగిన పారిశుద్ధ్య సౌకర్యాల ఆవశ్యకత వంటి కొన్ని కీలక సమస్యలు పరిష్కరించబడలేదని నమ్ముతున్నారు.

ఈసందర్భంగా అంజు అరోరా మాట్లాడుతూ… గత సంవత్సరం, రాజ్యసభలో సమర్పించిన ఒక నివేదిక భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చూస్తే, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అతి తక్కువ మరుగుదొడ్లు ఉన్నాయని వెల్లడించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30,023 పాఠశాలల్లో, 2,124 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవన్నారు. పారిశుద్ధ్య సౌకర్యాలు లేని పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అలాగే విద్యార్థినీలకు టాయ్‌ లెట్ల సమస్య ఉందన్నారు. ఈ కారణాలతో ప్రతి నెలా విద్యార్థులు పాఠశాలలను మానేస్తున్నారన్నారు. హైకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితి ఇంకా మెరుగు పడలేదని దివ్య రాజేశ్వరి వుపద్రస్తా అభిప్రాయపడ్డారు. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే ఇప్పటికీ 150 పాఠశాలలకు సరిపడా మరుగుదొడ్లు లేవన్నారు. వాగ్దానాలు, ఎజెండాలు స్పష్టమైన మార్పుకు దారితీయాలి కానీ కాగితంపై ఉండకూడదని దివ్య జోడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement