Saturday, May 18, 2024

Retirement | మెగ్‌ లానింగ్‌ సంచనల నిర్ణయం… అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

ఆస్ట్రేలియా క్రికెట్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆసీస్‌ను 5 సార్లు విశ్వవిజేతగా నిలిపిన స్టార్‌ మహిళా క్రికెటర్‌ మాగ్‌ లానింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. సడన్‌గా తన రిటైర్మెంట్‌ ప్రకటించి అందరికి షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు మెగా ఈవెంట్‌లలో వరుస విజయాలతో ప్రపంచాన్ని ఏలుతుంటే.. ఆ సమయంలోనే ఆసీస్‌ మహిళా జట్టు సారథ్య బాద్యతలు అందుకున్న మెగ్‌ లానింగ్‌ మహిళా క్రికెట్‌ రూపు రేకలనే మార్చేసింది.

13 ఏళ్ల సుదిర్ఘ కాలం ఆసీస్‌ జట్టుకు సేవలందించిన లానింగ్‌ తన నాయకత్వంలో ఏకంగా 5 ఐసీసీ వరల్డ్‌ కప్‌ ట్రోఫీలను అందించి సంచలనం సృష్టించింది. మెగ్‌ లానింగ్‌ సారథ్యంలో ఆసీస్‌ (2014 టీ ప్రపంచకప్‌, 2018 టీ20 ప్రపంచకప్‌, 2020 టీ20 ప్రపంచకప్‌, 2022 వన్డే ప్రపంచకప్‌, 2023 టీ 20 ప్రపంచకప్‌) ట్రోఫీలను గెలుచుకొని ఐదు సార్లు విశ్వ విజేతగా నిలిచింది. ఇక 25 మార్చి 1992లో సింగపూర్‌లో జన్మించిన మెగ్‌ లానింగ్‌ 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను ఆరంభించింది.

2010లో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడింది. కెరీర్‌ ఆరంభించిన అనది కాలంలోనే ఆసీస్‌ కీలక బ్యాటర్‌గా మారింది. టాప్‌ ఆర్డర్‌లో భారీ షాట్లతో ఆసీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇక నాలుగు ఏళ్ల వ్యవధిలోనే ఆసీస్‌ టీమ్‌ సారథ్య బాద్యతలను అందుకుంది. ఇక అక్కడి నుంచి తిరుగులేని క్రీడాకారిణిగా ముద్ర వేసుకుంది. మెగ్‌ కెప్టెన్సీలో 80 శాతం విజయాలు ఉండటం వశేషం. అద్భుతమైన కెప్టెన్సీతో ఆసీస్‌కు నాలుగు టీ20, ఒక వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీని అందించింది. ఇక గురువారం మెగ్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చింది.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడిన మెగ్‌ లానింగ్‌. తనకు ఇష్టమైన క్రికెట్‌ను 13 ఏళ్లపాటు ఆడటం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, ఆసీస్‌ టీమ్‌ మేట్స్‌, క్రికెట్‌ ఆస్ట్రేలియా, తన అభిమానులకు ధన్యవాదాలు.. క్రికెటే జీవితంగా భావించిన తాను ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. కానీ నాకు ఇదే సరైన సమయం అనిపించింది. అందుకే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాను అని మెగ్‌ లానింగ్‌ పేర్కొంది.

ఎన్నో రికార్డులు..

18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌ మొదలు పెట్టిన మెగ్‌ లానింగ్‌ ఎన్నో రికార్డులను సాధించింది. కెరీర్‌ ఆరంభించిన నాలుగు ఏళ్ల కాలంలోనే కెప్టెన్‌గా అవతరించింది. టీ20తో కెరీర్‌ ప్రారంభించిన మెగ్‌ తర్వాత వన్డే, టెస్టు జట్లకు కూడా ప్రాతినిథ్యం వహించింది. ఆసీస్‌ తరఫున మొత్తం 241 మ్యాచ్‌లు ఆడింది. ఇక కెరీర్‌లో అత్యధికంగా 132 టీ20 మ్యాచ్‌లు ఆడిన మెగ్‌ లానింగ్‌ 2 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీలతో 3405 పరుగులు చేసింది.

103 వన్డేలలో 15 శతకాలు, 21 అర్ధ శతకాలతో 4602 పరుగులు చేసింది. ఆరు టెస్టులు ఆడిన ఈమె రెండు హాఫ్‌ సెంచరీలతో మొత్తం 345 పరుగులు చేసింది. మరోవైపు మహిళల ఐపీఎల్‌లోనూ మెగ్‌ లానింగ్‌ సత్తా చాటింది. ఢిల్లిd క్యాపిటల్స్‌ సారథ్యం వహించిన ఈమె తొలి సీజన్‌లోనే ఢిల్లిdని ఫైనల్స్‌కు తీసుకెళ్లింది. ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిపోయింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మెగ్‌ లానింగ్‌ 17 శతకాలతో 8532 పరుగులు చేసి తన సత్తేంటో నిరూపించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement