Sunday, April 28, 2024

TS : సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్..

ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత అక్రమ అరెస్టును సవాల్‌ చేస్తూ సోమవారం ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో కంటెంప్ట్‌ అఫిడవిట్‌ వేయనున్నారు. ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ ఆమెను అక్రమంగా అరెస్టు చేసిందని, అది సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. కాగా, ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు.

- Advertisement -

ఇప్పటికే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం నిబంధనలను విరుద్ధమని కేటీఆర్ ఇప్పటికే ఆరోపించారు. ఇదే విషయంపై ఢిల్లీలో న్యాయవాదులో సంప్రదింపులు జరిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement