తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పెద్దపల్లికి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు జెండా కూడలిలో నిర్వహించే కార్నర్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
- Advertisement -
ఇందుకోసం ఏర్పాట్లను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే దాసరి కోరారు.