Thursday, May 2, 2024

MBNR: కాళికామాత ఆలయంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు

కొత్తకోట, సెప్టెంబర్ 8 (ప్రభ న్యూస్); కొత్తకోట మండల పరిధిలోని కనిమెట్ట గ్రామంలో ప్రసిద్ధ శ్రీశ్రీశ్రీ కాళికాదేవీ ఆలయంలో శ్రావణమాస జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా దేవాలయానికి తీసుకెళ్లి ప్రత్యక పూజలు నిర్వహించారు. శుక్రవారం శ్రావణ మాసం బోనాల జాతర వేడుకల సందర్భంగా ఆలయంలో వెలసిన కాళికాదేవి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. జాతర సందర్భంగా భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, గ్రామ సర్పంచ్ గాదం రాణీ పరమేష్, సిడిసి చైర్మన్ బి.సం చెన్నకేశవరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సురేంద్రనాథ్ రెడ్డి, కనిమెట్ట గ్రామ మాజీ సర్పంచ్ విపి పెంటయ్య, బీఆర్ఎస్ ఉద్యమ సీనియర్ నాయకులు ఎం.హరినాథరావు, ఆకుల రమేష్, రామిరెడ్డి, గ్రామ ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement