Monday, April 29, 2024

Spl Feast – జి 20 ప్ర‌తినిధుల‌కు రాష్ట్ర‌ప‌తి రేపు మ‌హావిందు – కెసిఆర్ తో స‌హా విప‌క్ష సిఎంల‌కూ ఆహ్వానం

ఢిల్లీలో రేప‌టి నుంచి జ‌ర‌గ‌నున్న‌ జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమయింది. వివిధ దేశాల అధినేతలు ఒక్కొక్కరుగా హస్తినకు చేరుకుంటున్నారు. రేపు, ఎల్లుండి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు 40కి పైగా దేశాధినేతలు హాజరవుతున్నారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా సమావేశాలను నిర్వహించనున్నారు.

మరోవైపు రేపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత స్థాయి విందును ఇవ్వబోతున్నారు. ఈ విందుకు మాజీ ప్రధానులు దేవేగౌడ, మన్మోహన్ సింగ్ లకు ఆహ్వానం అందింది. వారితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను విందుకు ఆహ్వానించారు. వీరిలో విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, నితీశ్ కుమార్, భగవంత్ మాన్, హేమంత్ సొరేన్, సిద్ధరామయ్య తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఆహ్వానం అందింది. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరిట వారందరికీ ఆహ్వాన పత్రికలు అందాయి.

ఈ విందుకు ప్రపంచ నేతలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రైమ్ మినిస్టర్ రుషి సునాక్, సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ పీఎం కిషిండా తదితరులు కూడా హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement