Sunday, May 5, 2024

స్ఫూర్తి ప్రధాత జగ్జీవన్ రామ్: పెద్దపల్లి ఎమ్మెల్యే

ప్రస్తుత సమాజానికి స్ఫూర్తి ప్రదాత జగ్జీవన్రామ్ అని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అట్టడుగు మూలాల నుంచి చైతన్యవంతమైన స్ఫూర్తితో అణగారిన వర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమాభివృద్ధే పరమావధిగా, ప్రతిభాపాటవాలతో ఎదిగి భారతదేశ ఉపప్రధానిగా, రక్షణ మంత్రిగా ఎన్నో అత్యున్నతమైన పదవులకు వన్నెతెచ్చిన స్ఫూర్తిదాయక నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. తన రాజకీయ జీవితం 50 ఏళ్ళలో అన్ని పదవులు అనుభవించి కూడా ఎన్నో అవరోధాలు, అడ్డంకులను ఎదుర్కోని నిమ్నజాతి, సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని అన్ని రంగాలలో ముందుండాలని ఒక యజ్ఞంలా సుధీర్ఘ రాజకియంలో గడిపారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement