Friday, May 3, 2024

అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రండి – ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

రామంతపూర్: హబ్సిగూడ డివిజన్లోని రామంతపూర్ పెద్ద చెరువు లో జరుగుతున్న ఎస్ ఎన్ డి పి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి నేడు ప‌రిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు , హబ్సిగూడ, రామంతపూర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురి కావద్దని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్, హబ్సిగూడ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బి.వి చారి, ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి, నందికంటి శివ, మహేందర్, పాశం నగేష్, విశాల్ ,రంజిత్, జెసిబి రాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement