Saturday, September 21, 2024

సామ్యవాద తాత్త్వికుడు సాయిబాబా!

సర్వ వస్తు జీవ సముదాయములో ఐక్య మైవున్న సాయిబాబా తన భక్తులను నలుదిక్కుల నుండి కాపాడతారు. జనుల హితాన్ని కోరే శ్రీ సాయినాథు లు ద్వారకామాయికి వచ్చే భక్తులకు ఎప్పుడూ అనేక విషయాలను తెలిపేవారు. వారి కష్టాలను తీర్చేవారు. ఆయా సమయాలలో బా బా పలికే పలుకులు చాలా క్లుప్తంగా, భావగర్భి తంగా, అర్థపూర్ణముగా, ఎంతో శక్తివం తం గా సమతుల్యంగా వుండేవి. శ్రీ సాయినాథులు ఎప్పుడూ ఐహి క సుఖాలకోసం తాపత్రయ పడలేదు. ఈర్ష్య, అసూయ లు అంటే ఏమిటో ఎరుగని నిజమైన మానవ స్వరూప దైవం. స్వార్థం అంటే తెలియ ని సాధువు అయినా కూడా తనను ఆవహించిన మాయాశక్తి గురించి ఇలా తెలియజేశారు.
”నేను ఫకీరును అయినప్పటికీ ఏ చీకూ చింతా లేనప్పటికీ ఒకేచోట నివసిస్తున్నాను. ఎం దుకంటే తప్పించుకొనలేని మాయ నన్ను బాధి స్తున్నది. నన్ను నేను మరచిపోయినా ఆమెను మాత్రం మరవలేకుండా వున్నాను. ఇదంతా భగ వంతుని మాయ. అది బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరుస్తుంటుంది. నావంటి ఫకీరనగా దానికెంత? ఎవరయితే భగవంతుని ఆశ్రయిం చెదరో వారు భగవంతుని కృపవల్ల ఆమె బారి నుండి తప్పించుకొంటారు.” అనేవారు.
ఇంకా తన భక్తుల మేలుకొరకు బాబా ఇలా చెప్పేవారు. ”ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించునో, వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి… సాయి… అని నీవు పఠించి నచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో పనిలేదు. షోడశోప చారములు, అవసరం లేదు. భక్తి వున్నచోటనే నా నివాసము” అనేవారు. బాబాకు పూర్తిగా శరణాగ తులైన వారి క్షేమాన్ని బాబా కాంక్షించేవారు.
పూనా జిల్లాకు చెందిన భీమాజీ పాటిల్‌కు ఛాతి జబ్బువచ్చింది. భయంకరమైన క్షయవ్యా ధితో బాధపడుతున్న భీమాజీపాటిల్‌ నానాసా హెబ్‌ సలహాపై షిరిడీకి వచ్చి బాబా పాదా లను ఆశ్రయించాడు. అప్పుడు బా బా ”నీ యాతురతను పారద్రో లుము. నీ కష్టాలు గట్టెక్కా యి. ఎంతటి పీడ, బాధలు న్న వారైనా ఎప్పుడైతే మసీ దు మెట్లు ఎక్కుతారో వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఫకీరు అత్యంత దయార్ద్ర హృదయుడు. నీ రోగమును బాగుచేసి కాపాడెదరు.”
ప్రతి అయిదు నిమిషాలకు రక్తం కక్కే భీమాజీ బాబా సముఖమున ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. బాబా ”దయతో కాపాడెదను” ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే భీమా రోగము తగ్గడం ప్రారంభమైంది. అప్పుడు బాబా భీమాజీని భీమాబాయి ఇంటికి తీసు వెళ్ళి అక్కడ వుండమని చెప్పారు. అక్కడున్నప్పుడు భీమాజీకి వచ్చిన రెండు స్వప్నాల ద్వారా భీమా జీ రోగం పూర్తిగా తగ్గించారు బాబా. సాయిబాబా దృష్టిలో అందరూ సమానులే. ఎక్కడనుంచి ఎవరు వచ్చి తనను శరణు వేడితే అందరి యెడల సమాన ధర్మాన్ని చూపించేవారు. అందరూ కూ డా జీవితంలో సమాన ధర్మాన్ని ఆచరించి చూపాలని కోరిన సామ్యవాద తాత్వికులు శ్రీ సాయిబాబా.

  • వై.శ్రీనివాసశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement