Wednesday, May 15, 2024

MLA Bhethi Subhash Reddy – నాకెందుకు టిక్కెట్ ఇయ్య‌లేదో చెప్పాల్సిందే … లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా

ఉప్ప‌ల్ లో తాను తిరిగి పోటీ చేసేందుకు సీటు ఎందుకు ఇవ్వ‌లేదో అధిష్టానం చెప్పాల్సిందేనంటూ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. డిమాండ్ చేశారు.. గ్రేట‌ర్ లో మిగిలి ఉన్న ఏకైన ఉద్య‌మ‌కారుడికి సీటు ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం తెల‌వాల‌ని అన్నారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికీ కాంగ్రెస్ జెండా ప‌ట్టుకుతిరుగుతున్న వ్య‌క్తికి నా సీటు ఎలా ఇస్తారంటూ బిఆర్ఎస్ అథిష్టానాన్ని ప్ర‌శ్నించారు.. క‌నీసం సీటు ఇవ్వ‌డం తేల‌ద‌ని త‌న‌కు తెల‌ప‌క‌పోయేంత త‌ప్పు తానే చేశాన‌ని అన్నారు.. ప‌ద‌వి అడ్డం పెట్టుకుని కబ్జాలు చేశానా, లంచాలు తిన్నానా అంటూ ప్ర‌శ్నించారు.. వారం రోజుల‌లో స‌మాధానం రాకుంటే భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు భేతి సుభాష్ రెడ్డి..

ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే…. ఆయ‌న మాట‌ల‌లోనే …

గత 23 సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీకి సేవ చేసాను.. నాకు ఇచ్చిన ప్రతీ బాధ్యతను బాధ్యతాయుతంగా పనిచేశాను.ఏ నియోజకవర్గంలో నాకు ఇంచార్జి బాధ్యతలు ఇస్తే అక్కడి వ్యక్తుల గెలుపుకు కృషి చేసాము.పార్టీ కోసం ఎంతో కష్టపడి గెలుపుకోసం పనిచేశాను.2009 తరువాత ఉద్యమ బాటలో ఎన్నో కేసులు నమోదు చేసుకున్నాను.ఎన్నో బందులకు పార్టీ పిలుపునిచ్చినా భయపడకుండా పనిచేశాను.తెలంగాణ వచ్చాక నాకు టికెట్ ఇస్తే అప్పుడు ఒడి పోయాను.సర్ నేను ఒడి పోయా ఏమి చేయమంటావు అంటే మళ్ళీ పనిచేసుకో అని కేసీఆర్ చెప్తే మరుసటి రోజు నుండి జనం లో ఉండి పనిచేశాను.2019 మళ్ళీ టికెట్ ఇస్తే నలభై వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందాను.నేను ఎమ్మెల్యే గా ఉండి జీ హెచ్ ఎం సి కార్పొరేటర్లను గెలిపించుకున్నా.కరోనా వల్ల కొద్దిగా 2 సంవత్సరాలు ప్రజలకు దూరమయ్యాను.ఒక ఎమ్మెల్యే గా ఉప్పల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసాను.నాకు టికెట్ రాకపోతే వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి పరామర్శించారు. టికెట్ వేరే వాళ్లకు ఇచ్చారు. అతను ఏ రోజైనా బిఆర్ఎస్ జెండా మోసాడా. ఇప్పుడు టికెట్ ఇచ్చిన అభ్యర్థి పార్టీలో జాయిన్ అయిన తరువాత ఏ రోజు పార్టీ కోసం పని చేయలేదు. తన సొంత పనులకు పనిచేశాడు. ప్రతీ ఫ్లెక్సీ లో కాంగ్రెస్ నాయకుల ఫోటో పెట్టుకుంటూ ఇప్పుడు టికెట్ ఇచ్చిన అభ్యర్థి తిరుగుతున్నాడు. అతను కాంగ్రెస్ నాయకుడా బిఆర్ఎస్ నాయకుడా… మొత్తం 29 నియోజకవర్గాల్లో ఏ ఒక్క అభ్యర్థిని తీయకుండా నా ఒక్కని టికెట్ ఎందుకు తీసి వేశారు .నాపై ఏమైనా కబ్జాలు ఉన్నాయా,ఎందుకు తీసి వేశారు నాకు చెప్పలేదు.ఎందుకు నన్ను పిలిచి అడగలేదు.ఒక ఉద్యమకారుడు అయినందు వల్ల నాకు టికెట్ ఇవ్వలేదా..ఇంకా నాకు ఎమ్మెల్యే పదవి ఉంది.నేను ఏ మొఖం పెట్టుకొని ప్రజలలోకి వెళ్ళాలి.నన్ను ఎందుకు తీసివేశారు.చెప్పాలి.ఎన్నో సీనియర్ సిటీజన్స్ బిల్డింగ్ లు కట్టాను.వాళ్ళు అందరూ వచ్చి తమ్ముడు నీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు.అని అడుగుతే నాకు ముఖం లేదు.ఉద్యమకాలంలో పార్టీ కోసం కష్ట పడ్డ నాయకులను వెతికి మరీ దళిత బంధు ఇచ్చాను. నన్ను గెలుపు కోసం ప్రయత్నం చేసుకో అని పార్టీ చెపితే ,నేను 30 రోజులు పాదయాత్ర చేసాను. ఎక్కడ ప్రజలు నన్ను వ్యతిరేకించలేదు…మొత్తం 10 డివిజన్లు తిరిగాను..ఇన్ని చేసినా నన్ను పార్టీ గుర్తించక పోవడం బాధాకరం…నా కార్యకర్తలు,నా కుటుంబ సభ్యులు ధర్నాలు చేద్దామన్నా నేను వద్దు అని ఆపాను….ఉరి దీసే ముందు లాస్ట్ కోరిక అడుగు తయారు.కానీ నన్ను నా లాస్ట్ కోరిక అడగలేదు అధిష్టానం.దానికి బాధ అనిపిస్తుంది.తప్పు చేసిన వాళ్లకు టికెట్ ఇస్తారా.ఇంకా అభ్యర్థుల మార్పు చేర్పులు ఉంటాయి అన్నారు.ఇంకా సంయమనం పాటిద్దాం.నేను నా కార్యకర్తలకు ఏమి చెప్పాలి..ఇంకా వారం పది రోజులు అగుదాం..నాకు పార్టీ ఏమి కార్యాచరణ ఇస్తుంది.చూసి దాని తరువాత నిర్ణయం తీసుకుందాం.నేను ప్రజల కోసం పని చేస్తా ప్రజలలోనే ఉంటా..నేను ఏది చేసినా ప్రజల కోసం చేస్తా.ఉన్న మూడు నెలలు ప్రజలకు రావాల్సిన లబ్దిచేకూరుస్తా.. అంటూ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి త‌న గ‌ళాన్ని వినిపించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement