Wednesday, May 1, 2024

చెన్నూరు సుందరీకరణపై ఎమ్మెల్యే బాల్క సూచన

చెన్నూరు పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బాల్క సుమన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి, పార్క్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మినీ ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లతో పాటు మున్సిపాలిటీ వార్డులోని సానిటేషన్, లైట్లు, కాల్వల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరు పట్టణ సుందరీకరణలో భాగంగా 15 కోట్లతో నిర్మిస్తున్న నాలుగు లైన్ల ప్రధాన రహదారి, సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. పనుల వేగం, పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement