Thursday, May 2, 2024

సృజనాత్మకతను వెలికితీసే వేదిక కళాభారతి

సృజనాత్మకతను వెలికితీసే వేదిక కళాభారతి అని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళాభారతి ఆడిటోరియం భవనాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కామారెడ్డి ప్రజలకు గంప గోవర్ధన్ లాంటి నాయకులు దొరకడం అదృష్టమన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం అయిన తరువాత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కామారెడ్డి పట్టణ సుందరీకరణకు పాటు పడుతున్న వ్యక్తి గంప గోవర్ధన్ అని కొనియాడారు. అర్ అండ్ బి మంత్రిగా తాను సైతం అచర్యపోయేవిదంగా కామారెడ్డి పట్టణంలో అర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం చేశారని ప్రశంసించారు. ప్రభుత్వ కార్యాలయాలు మొక్కుబడిగా కాకుండా తాను దగ్గరుండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కట్టిస్తున్నారని చెప్పారు. కామారెడ్డి నియోజికవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న గంప గోవర్ధన్ కు.. తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇంత గొప్పకళాభారతి ఆడిటోరియంను తనచేతులు మీదుగా ప్రారంభించడం  అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సృజనాత్మకతకు కళా భారతి వేదిక కావాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కామారెడ్డి పట్టణంలో ఇంత మంచి ఆడిటోరియం నిర్మాణానికి నిధులు కేటాయించి సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కెటిఆర్ లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement