Friday, December 6, 2024

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు -మంత్రి పువ్వాడ రాఖీ శుభాకాంక్ష‌లు

రాఖీ పౌర్ణమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా, చెల్లెళ్ల మధ్య ప్రేమకు ప్రతిరూపం రాఖీ పౌర్ణమి అని మంత్రి అజయ్ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని మంత్రి అధికారిక నివాసంలో పువ్వాడ అజయ్ కుమార్ కు రాజాహిత బ్రహ్మ కుమారి సోదరీమణులు ఆప్యాయంగా రాఖీ కట్టి మిఠాయి తినిపించి ఆశీస్సులు అందించారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. తోడబుట్టినవారే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ మన సోదరులే అనే భావన పెంపొందించడమే ఈ పండుగ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముళ్ల‌కు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం ఘనమైన సందర్భమని మంత్రి చెప్పారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement