Sunday, May 5, 2024

ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు.. పాల్గొన్న తలసాని, మహమూద్ అలీ

హైదరాబాద్, జులై 24 (ప్రభ న్యూస్) : రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు సోమవారం పీవీ మార్గ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో యువనేత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో వినూత్నంగా, అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, కోలేటి దామోదర్ గుప్తా, అనిల్ కుమార్ కూర్మాచలం, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, నగర గ్రంధాయల సంస్థ చైర్మన్ ప్రసన్న, కార్పొరేటర్ లు హేమలత, టి.మహేశ్వరి, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, తరుణి, సీనియర్ నాయకులు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రపంచ రికార్డ్ సాధించిన రూబిక్స్ క్యూబ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ కుట్టి కండ్లకు గంతలు కట్టుకొని రూబిక్ క్యూబ్స్ తో రూపొందించిన కేటీఆర్ చిత్రం, హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అన్న విషెస్ ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఇర్ఫాన్ కుట్టిని సత్కరించి అభినందించారు. అదేవిధంగా గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద ఒకొక్కరికి 10 లక్షల రూపాయల రిక్స్ కవరేజ్ తో వివిధ ఛానళ్లకు చెందిన వెయ్యి మంది వీడియో జర్నలిస్ట్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ లను మంత్రుల చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్బంగా థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో గల వరల్డ్ బిగ్గెస్ట్ త్రీడీ స్క్రీన్ లో మంత్రి కేటీఆర్ కు విషెష్ తెలియజేస్తూ రూపొందించిన వీడియో ను వీక్షించారు. అదేవిధంగా కేటీఆర్ పనితీరు, వ్యక్తిత్వం, సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక సాంగ్ ను ప్రదర్శించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కేక్ ను ముఖ్య అతిధిగా హాజరైన హోంమంత్రి మంత్రి మహమూద్ అలీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయి కిరణ్ యాదవ్ లతో కలిసి కట్ చేశారు. ఈ సందర్బంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… కేటీఆర్ గొప్ప నాయకుడు అని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమల ఏర్పాటు, ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఎంతో మంది యువతకు కేటీఆర్ స్పూర్తిగా మారారని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement