Thursday, May 16, 2024

TS : ప్రచారంలో దూసుకపోతున్న మంత్రి గంగుల కమలాకర్​

కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ గుర్తుపట్టి పలకరించేంత చనువు. ప్రతీ వాడలో సమస్యలను పరిష్కరించిన తీరు ఈ ఎన్నికల సమయంలో గంగులకు తిరుగులేకుండా చేసింది.

ఎక్కడికి వెల్లినా తమ సొంతమనిషిలా బావిస్తూ మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. పైపెచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను, మంత్రి గంగుల చేసిన పనులను వారే వివరిస్తున్నారు. ఇంకా ఏమన్నా కావాలా అని మంత్రి అడుగుతుంటే… మన కరీంనగర్ కు ఏం కావాలో మీకన్నా మాకు బాగా తెలుసా… మీరే గెలుస్తారు, మీరే మరింత అభివ్రుద్ది చేస్తారు అని బదులిస్తున్నారు. సోమవారం కొత్తపల్లి మండలం చింతకుంటలో ఎన్నికల ప్రచారం లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నప్పుడు ఎదురైన అపూరూప దృశ్యాలివి.

Advertisement

తాజా వార్తలు

Advertisement