Sunday, May 19, 2024

మహిళ కార్పొరేటర్లు, ఉద్యోగులకు ఆటల పోటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో మహిళ కార్పొరేటర్లకు మున్సిపల్ ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరి శంకర్, మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement