Monday, April 29, 2024

MIM – ప్రాంతీయ పార్టీలుంటేనే అభివృద్ధి – అందుకే కెసిఆర్ కు సంపూర్ణ మ‌ద్ద‌తు…అస‌దుద్దీన్ ఓవైసీ

సంగారెడ్డి – ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణకు మూడో సారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో ఏఐఎంఐఎం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ లు రెండు అవిభక్త కవలలని ఆరోపించారు. అవి రెండు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలనే అనుసరిస్తాయని విమర్శించారు. టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి కు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉందని అన్నారు. అక్కడి నుంచి ఆయన కాంగ్రెస్ లోకి వచ్చారని తెలిపారు. అందుకే వచ్చే ఎలక్షన్ లో ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ కు సరైన తీరుగా బదులివ్వాలని కోరారు.

మన రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నాలుగో పార్టీ ఎంఐఎం కూడా ఉందని ఆయన తెలిపారు. తాము ఇప్పటికే పవర్ ప్లే స్టార్ట్ చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. పవర్ తమ చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి.. ఇక్కడ బీజేపీ గెలిస్తే బీసీని సీఎం చేస్తానని చెబుతున్నారని అన్నారు. బీసీని సీఎం చేసే బీజేపీ.. కుల గణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు..
వచ్చే ఎన్నికల్లో మామకు (బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్) కు సపోర్ట్ గా నిలవాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. మామ మూడో సారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీల కంటే, ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటనే డెవలప్ మెంట్ ఎక్కువగా జరుగుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement