Tuesday, May 14, 2024

మెట్రో ట్రైన్ మ‌రో ఘ‌న‌త‌-25నిమిషాల్లో ..21కిలో మీట‌ర్లు-నిలిచిన ప్రాణం

హైద‌రాబాద్ మెట్రో మ‌రో ఘ‌న‌త‌ని సాధించింది. గుండెను యుద్ధ ప్రాతిపదికన మార్చేందుకు వరంలా మారింది మెట్రో రైల్. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కుటుంబం.. గుండెను దానంగా ఇవ్వటానికి ఒప్పుకోవటంతో జబ్లీహిల్స్ లోని మరో రోగికి పునర్జన్మను ఇచ్చినట్లైంది.నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి మెదడుకు తీవ్ర గాయమైంది. దీంతో.. ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించగా.. ఆరోగ్యం విషమించి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు అతడి కిడ్నీలు.. గుండె.. కాలేయం.. కార్నియాను దానం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఇదే సమయంలో మూత్రపిండాలు.. గుండె దెబ్బ తిని చికిత్స పొందుతున్న 32 ఏళ్ల వ్యక్తికి శస్త్ర చికిత్స చేసేందుకు వీలుగా జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు జరిగాయి.

ఇందులో భాగంగా కామినేని ఆసుపత్రి నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ కు అంబులెన్సు ద్వారా 3 నిమిషాల్లో గుండెను తరలించారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మెట్రోస్టేషన్ కు 21 కిలోమీటర్ల దూరం కాగా మధ్యలో 17 స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రత్యేక మెట్రో రైల్ ను ఎక్కడా ఆపకుండా కేవలం 25 నిమిషాల వ్యవధిలో చేర్చారు. అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి కేవలం 3 నిమిషాల్లో చేర్చి.. కిడ్నీ.. గుండె మార్పిడిని పూర్తి చేశారు. దీంతో.. నిండు ప్రాణం నిలిచింది. ఈ ఆపరేషన్ లో మెట్రో రైల్ కీలకభూమిక పోషించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement