Saturday, May 4, 2024

వ‌ర‌ద కాలువ‌ను ప‌రిశీలించిన కృఫ్ణ రివ‌ర్ బోర్డ స‌భ్యులు…

పెద్దవూర, ప్రభన్యూస్‌ : వరద కాలువ ద్వారా కృష్ణ రివర్‌ వాటర్‌ను ఎన్ని క్యూసెక్కుల వాటర్‌ను వాడుతున్నారో కృష్ఱా రివర్‌ బోర్డ్‌ సభ్యులు డాక్టర్‌ బీఆర్‌కె పిళ్ళై హెంబర్‌ ఎలిమినేటి మాధవరెడ్డిలో లెవెల్‌ వరద కాలువను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా 570 అడుగులు ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడు వచ్చే గ్రావిటీ- వాటర్‌, అంతకంటే తక్కువ నీరు ఉన్నప్పుడు టు-ర్బైన్‌ల ద్వారా పంపింగ్‌ విధానంలో వచ్చే వాటర్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రాజెక్ట్‌ నిర్మాణ శైలిని పరిశీలించారు. ఆ తరువాత పొట్టి చెలిమ పవర్‌ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్‌ కృష్ణా రివర్‌ బోర్డు సభ్యులు డాక్టర్‌ రాయ్‌ పూరి, శివరాజన్‌, అనుపము ప్రసాద్‌, కోటేశ్వరరావు, డీఎస్‌ ప్రసాద్‌, శ్రీధర్‌, దేశ్పాండే, అశోక్‌ కుమార్‌, ఎస్‌ఈ రఘునందన్‌ రావు, ఈఈ కే.శ్రీనాథుడు, ఏడి రమేష్‌ బాబు, సూర్యాపేటసీఈ శ్రీనివాసులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement