Thursday, December 7, 2023

నారాయణఖేడ్ లో మైనర్ బాలికపై లైంగిక దాడి.. పొక్సో కేసు నమోదు

సంగారెడ్డి, (ప్రభ న్యూస్): జూబ్లీహిల్స్ కేసు మరవకముందుకే నారాయణఖేడ్ లో మరో మైనర్ బాలిక పై లైంగిక దాడి జరిగిన ఘటన కలచి వేస్తుంది. నారాయణ ఖేడ్ పి ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబందించిన వివరాలు డిఎస్పీ శ్రీరామ్ వెల్లడించారు. నారాయణఖేడ్ మండల పరిధిలో తల్లితండ్రులతో కలిసి నివసించే 14 సంవత్సరాల బాలుకను స్థానికంగా నివసించే నవీన్ అనే యువకుడు కొద్ది రోజులుగా పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో ఈ నెల 6న బాలికను నవీన్ ఇంట్లో నుండి తీసుకెళ్లాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు నారాయణ ఖేడ్ పి ఎస్ లో పిర్యాదు చేశారు. బాలిక మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు.

- Advertisement -
   

ఫోన్ ట్రెసింగ్ తో బాలిక ఆచూకీ లభ్యం..
బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక స్నేహితులను విచారించగా నవీన్ అనే యువకుడు బాలిక తో స్నేహంగా మెదులుతున్నాడని విచారణలో తేలింది. నవీన్ సెల్ ఫోన్ ట్రెస్ చేసి బాలిక ఆచూకిని పోలీసులు కనుక్కున్నారు. నిందితుడు నమ్లిమెట్ కు చెందిన నవీన్ ను విచారించగా నాలుగైదు సార్లు బాలిక పై లైంగిక దాడికి పాల్పడట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అమ్మాయిని కుటుంబీకులకు అప్పగించి నవీన్ ను రిమాండ్ కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement