Friday, October 11, 2024

మరింత తగ్గిన ఎల్‌ఐసీ షేరు విలువ.. మ‌రింత ప‌డిపోయే చాన్స్‌

స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించిన నాటి నుంచి జీవిత బీమా సంస్థ షేర్ల విలువ పతనం అవుతూనే ఉన్నాయి. వరసగా 9వ రోజు కూడా ఎల్‌ఐసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. శుక్రవారం నాడు సంస్థ షేర్లు ఒక దశలో 1.62 శాతం పతనమై 709.20 వద్ద ట్రేడ్‌ లయ్యాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయిన తరువాత ఇదే కనిష్టం. దీంతో మదుపరులు భారీగా నష్టపోయారు.
ఎల్‌ఐసీ షేర్లు మే 17న ఇష్యూ ధర 949తో పోల్చితే 8 శాతం నష్టంతో లిస్టయ్యాయి.

ఎల్‌సీ యాంకర్‌ ఇన్వెస్టర్ల లాక్‌ ఇన్‌ కాల వ్యవధి కొద్ది రోజుల్లో ముగిస్తుంది. దీని తరువాత యాంకర్‌ ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించే అవకాశం ఉంది. అప్పుడు షేరు విలువ మరింత పడిపోయో ప్రమాదం ఉందని రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ భయంలో వీరు ముందుగానే అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడి వల్లే ఎల్‌ఐసీ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement