Saturday, May 18, 2024

నాసిరకం పనులు వద్దు..

రామాయంపేట : మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ పనులు నాసిరకం పనులు చేస్తున్నారని బీసీ యువజన సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు అల్లాడి వెంకటేష్ ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్ పరిధిలో పలు కాలనీలలో మరమ్మతుల కోసం ప్రతి కౌన్సిలర్ కు రూ.లక్ష చొప్పున మంజూరు చేశారని చెప్పారు. అయితే డ్రైనేజీ మరమ్మతుల కోసం సి సి పైపులు మంజూరు చేయగా వాటి స్థానంలో మట్టి పైపులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీటిద్వారా పాక్షికంగా శిథిలం కావడంతోపాటు లీకేజీలు జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే సి సి పైపులు వేసే స్థానంలో మట్టి పైపులు వేయడం ద్వారా లీకేజీలు కావడంతోపాటు ఆయా కాలనీల్లో మురుగు మయంగా మారి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులతో పాటు మున్సిపల్ చైర్మన్ పట్టించుకోని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు .మున్సిపల్ పరిధిలో కేవలం కొన్ని వార్డుల్లో మాత్రమే ఇలాంటి పనులు జరుగుతున్నాయని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ ఎంతో ఆదర్శంగా ఉంటున్న క్రమంలో ఇలాంటి పన్నుల ద్వారా అపకీర్తి పాలైన అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఈ పనులను సక్రమంగా చేయాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement