Saturday, May 4, 2024

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

పాపన్నపేట : రైతులు పండించిన వరి ధాన్యంలోని ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లి సొసైటీ ఐకేపి ఆధ్వర్యంలో మండల పరిధిలోని పొడ్చన్‌పల్లి, యూసుఫ్‌పేట, కుర్తివాడ, లక్ష్మీనగర్‌ సొసైటీ ఛైర్మర్‌ రమేష్‌, వైస్‌ ఎంపీపీ విష్ణువర్దన్‌రెడ్డి తో కలిసి ఆమె కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వ ఉంచకుండా తగిన లారీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఎగుమతి చేయాలన్నారు. ఏగ్రేడ్‌ ధాన్యానికి 1888, సాధారణ రకం ధాన్యానికి 1868 రూపాయల మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జగన్నాథం, మాజీ ఆలయ ఛైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి, సర్పంచ్‌లు అనురాధ ఏడుకొండలు, దాసు, శ్రీనాథ్‌రావు, ఆర్డీఓ సాయిరాం, తహశీల్దార్‌ బలరాం, ఏవో ప్రతాప్‌, ఏఈఓలు రజిత, జనార్దన్‌, నాయకులు శ్రీనివాస్‌, రామాగౌడ్‌, కిష్టాగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement