Tuesday, March 21, 2023

రాజ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ సోదాలు

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రాజ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐదు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి ఇంటితో పాటు మొత్తం 50ప్రాంతాల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుపుతున్నారు. వసుధ ఫార్మా, రాజు పుష్ప, వెరిటెక్స్ సంస్థలలో అధికారులు ఆడిట్లను పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లు ఐటీ రిటర్న్స్ పై విచారిస్తున్నారు. భారీగా పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement