Thursday, April 25, 2024

డిస్నీ హాట్ స్టార్ లో హ‌న్సిక వివాహ వేడుక‌.. టీజ‌ర్ రిలీజ్

జైపూర్ లోని ఓ కోట‌లో హీరోయిన్ హ‌న్సిక వివాహం ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కాగా వారి పెళ్లికి సంబంధించి టీజర్ విడుదలైంది. హన్సిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఈ టీజర్ ను పోస్ట్ చేశారు. వీరు తమ పెళ్లి సినిమాకి ‘లవ్ షాది డ్రామా’ అని పేరు పెట్టారు.ఈ ప్రోమోలో తన జీవిత భాగస్వామి అయిన సొహైల్ కతూరియా గురించి పెళ్లికి ముందు వచ్చిన వదంతులను హన్సిక తొలగించే ప్రయత్నం చేసింది. పెళ్లికి ముందు సొహైల్ గత సంబంధాలు, మొదటి వివాహం గురించి జరిగిన ప్రచారం తనను ఇబ్బంది పెట్టినట్టు పేర్కొంది. ఈ విషయమై తన తల్లి మోనాతో మాట్లాడగా.. గతాన్ని చూడకంటూ చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. ఇదే విషయమై సొహైల్ తో చర్చించడాన్ని కూడా ప్రోమోలో భాగం చేశారు. వీరి వివాహ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 10న ప్రసారం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement