Sunday, May 5, 2024

సిద్దిపేట భారీ అగ్నిప్రమాదం..

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్ల‌వారుజామున‌ పట్టణంలోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఎక్కువ కావడంతో పక్క షాపులకు విస్తరించాయి. దీంతో ఐదు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement