Thursday, April 25, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయ‌..హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.150 పెరిగి ప్రస్తుతం రూ. 51,100 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.170 మేర పుంజుకుంది. దీంతో రూ.55,750 వద్ద ట్రేడవుతోంది. గత వారం, 10 రోజుల్లో చూసుకుంటే గనుక కేవలం ఒకటి, రెండు సార్లు మాత్రమే రేట్లు పడిపోయాయి. మిగతా రోజుల్లో భారీగా పెరిగాయి. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది.

దేశ రాజధానిలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.150 మేర పెరిగి రూ.51,250 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు దేశ రాజధానిలో రూ.170 మేర ఎగబాకి రూ.55,900 వద్ద ఉంది. సిల్వర్ రేటు ఇటీవలి కాలంలో భారీగా పెరిగింది. వరుసగా 2 రోజుల్లో రూ.1200 మేర పుంజుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,500 వద్ద కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో ఇంత వరకు ఈ స్థాయికి చేరలేదు. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో వెండి రేటు కాస్త తక్కువగానే ఉంటుంది. దేశ రాజధానిలో కేజీ సిల్వర్ ప్రస్తుతం రూ.72 వేల వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement