Sunday, November 10, 2024

TS : హ‌వేలి ఘ‌న‌పూర్ ఎంపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు ప‌ర్య‌ట‌న‌…

మెద‌క్ జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి ర‌ఘ‌నంద‌న్‌రావు ప‌ర్య‌టించారు. హ‌వేలీ ఘ‌న‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న స‌ర్పంచ్ శ్రీ‌కాంత్‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.


 అనంతరం కుచాన్ పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుస్తుందని ఇంటెలిజెన్స్, వివిధ మాధ్యమాల సర్వేలు చెబుతున్నాయని అన్నారు. మెదక్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలు బీజేపీ పార్టీవేనని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ నుంచి కాషాయ జెండాను ఎగరవేస్తామని అన్నారు. 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అని రఘునందన్ పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలు బీజేపీ పార్టీవేనని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ నుంచి కాషాయ జెండాను ఎగరవేస్తామని అన్నారు. 2024లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అని రఘునందన్ పేర్కొన్నారు.

- Advertisement -

కాగా, మెద‌క్ ఎంపీగా గెలిచేందుకు ర‌ఘునంద‌న్‌రావు పావులు క‌దుపుతున్నారు. జిల్లాలో వ‌రుస కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. అటు నేత‌ల‌ను క‌లుసుకొని త‌న‌కు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించాల‌ని కోరుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ, మండ‌ల స్థాయి కార్య‌కర్త‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు. అలాగే ప్ర‌ధాన మంత్రి ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను అన్ని గ్రామాల్లో ప్ర‌తి ఇంటికి చేరవేసేలా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కృషి చేయాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement