Thursday, April 25, 2024

MDK: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోని సీఎం నివాసంలో కలిశారు. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావుతో భేటీ అయిన మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సీఎంను కలిశారు.

మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించి మోసం చేయడంతోనే తీవ్ర మనోవేదనకు గురై కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు కౌడిపల్లిలోని మదన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. మదన్ రెడ్డి వెంట మాజీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement