Thursday, May 26, 2022

స్కూటీని ఢీ కొట్టిన కంటైనర్ : మహిళ మృతి

పఠాన్ చెరు : పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో భారీ కంటైనర్ బీభత్సం సృష్టించింది. స్కూటీ ఫై వెళ్తున్న మహిళ ను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మృతిచెందిన మహిళ పటాన్ చెరు ప్రభుత్వ హాస్పటల్లో ఫార్మాగా పనిచేస్తుంది. మృతురాలి పేరు జ్యోతిగా గుర్తించిన పోలీసులు, శరీరభాగం మొత్తం ముక్కలు ముక్కలు కావడంతో రోడ్డున పోయే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తరచుగా రింగ్ రోడ్ సమీపంలో అనేక ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీస్ వారిని వేడుకుంటున్నారు రోడ్డున పోయే ప్రయాణికులు. ప‌టాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement