Friday, April 26, 2024

బేబి బంప్ తో – న‌మిత ఫొటోషూట్

హీరోయిన్ న‌మిత గురించి తెలుగు,త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప‌లు చిత్రాల్లో న‌టించిన ఈ భామ 2017లో తన ప్రియుడైన వీరేంద్రను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత అంతగా కనిపించకపోయినా ఈ అమ్మడుకి ప్రేక్షకుల్లో మాత్రం ఆదరణ తగ్గలేదు. తన ఫ్యాన్స్ కు నమిత గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అంటూ బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా లైఫ్ లో కొత్త అధ్యాయం మొదలైంది. నేను ఇన్నాళ్లు కోరుకున్నది నీ గురించే.. నీకోసమే ప్రార్థించా అంటూ పుట్టబోయే బిడ్డ గురించి రాసి వచ్చింది నమిత. గుజరాత్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సొంతం, జెమిని, నాయకుడు, బిల్లా, సింహ చిత్రాల్లో నటించింది. అయితే 41 సంవత్సరాలలో నమిత ప్రెగ్నెంట్ కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement