Sunday, April 11, 2021

సొంత డబ్బులతో చైతన్య రథం..

మెదక్‌ : ప్రతి ఒక్క మానవుడు, సమాజానికి సేవ చేయలనే దృక్ఫధంతో మెదక్‌ పట్టణానికి చెందిన షపీ హైమత్‌ అలియస్‌ దౌడ్‌ సాటి వారికి సేవా చేయాలనే తపన ఉండాలంటే మనమే సమాజానికి ఆదర్శంగా అవుతామన్నారు. తనకున్న ఆటోలో వృద్దులు, గర్భీణీ స్త్రీలు, వికలాంగులు, వయోవృద్దులు మరియు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తనకు సమాచారం అందిన వెంటనే వారిని ఆటోలో ఎక్కించుకొని ఆస్పత్రులకు ఉచితంగా తరలించడం జరుగుతుంది. వారి వద్ద ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే వారికి తనకు తోచినంత సహాయం చేస్తూ ఆటోను నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. మెదక్‌ పట్టణానికి చెందిన షపీ హైమత్‌ దౌడ్‌ ఆయన వృతిరీత్యా ఆటో డ్రైవర్‌గా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన వాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, కూతుళ్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు ఆటో నడుపుతూ ఎదుటివారి సహాయం చేస్తూ వచ్చిన ఆదాయంతో కుమార్తెలకు పెళ్లిలు చేశాడు. ఇప్పటి వరకు తనకంటు ఒక సొంత ఇళ్ళు కూడా లేకపోవడం గమనార్హం. ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఇతరులకు తనవంతు సహాయం చేయడం మాములు విషయం కాదు. ఇటీవల తన సొంత ఖర్చులతో సుమారు రూ.20 వేలతో చైతన్యరథం ఏర్పాటు చేసుకొని ప్రమాదాలపై జరిగే సంఘటనల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. జిల్లావ్యాప్తంగా ఉన్న 20 మండలాలలో తన చైతన్య రథంలో తిరుగుతూ ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్‌ జిల్లా ఎస్‌పి చందనదీప్తి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా షఫీ అలియాస్‌ దౌడ్‌ మాట్లాడుతూ తన సొంత ఇంట్లో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటూ తన ఇంట్లో జరిగిన సంఘటనకు తాను చలించి సమాజంలో మరెవరికి ఇలాంటి ఇబ్బందులు కలగకూడదనే సదుద్దేశ్యంతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన వెల్లడించారు. తన లాంటి వ్యక్తి సేవలను క్షతగాత్రులకు ఎంతగానో ఆదర్శంగా తీసుకొని సాటివారికి సహాయం చేయవలసిందిగా ఆయన కోరారు. కోవిడ్‌-19 సందర్భంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారికి తనకు తోచినంత సహాయం చేయడానికి ముందుకు వచ్చిన సిని నటుడు సోనుసూద్‌ను ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిన సేవలను ప్రజలకు తెలియపరిచేందుకు చైతన్యరథం తయారు చేసి జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్‌ రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News