Friday, April 19, 2024

శక్తి (ఆడియోతో…)

నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగి ఇతరుల ఆధ్యాత్మిక శక్తి అవసరము. అంతరాత్మలో ఉన్న శక్తి వ్యక్తిత్వాన్ని నిర్మించి నీ మనసును క్రమశిక్షణలో ఉంచుతుంది. క్రమశిక్షణతో ఉన్న మనసు అంటే ప్రశాంతమైన, సంతోషకర మనసు అని అర్థం . గట్టి మనసు ఎప్పుడూ కలవర పడదు. ఈ శక్తిని పెంచుకోవడానికి భగవంతుని పట్ల నిజాయితీని, గాఢమైన ప్రేమను, గౌరవాన్ని కలిగి ఉండాలి. దీని ద్వారా నీ చుట్టు ప్రక్కల ఉన్న భౌతిక మరియు భావాత్మక వాతావరణంలోని చెడు నుండి ప్రభావితం కాకుండా నిన్ను నువ్వు రక్షించుకోగలవు. ఇతరుల నుండి ఆశీర్వదాలను పొందడం ద్వారా కూడా నీ శక్తిని పెంచుకోవచ్చు. నువ్వు సహకారం అందించిన వారి నుండి నీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. నీలోని ఆంతరిక శక్తిని అందరికీ పంచి పెట్టడమే ఇతరులకు సహకారాన్ని అందించేందుకు ఉత్తమ మార్గము. ఎవరైతే భగవంతుని గుణాలను తమ దృష్టిలో, కర్మలలో తీసుకువస్తారో వాఏ ఇతరులకు శక్తిని ఇవ్వగలరు. ఇటువంటి మార్గదర్వనను, విజ్ఞానాన్ని అందిం చడమే జీవితానికి పురోగతిని అందించడము.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement