Sunday, April 28, 2024

TS : బిఆర్ఎస్‌తో పొత్తుకు మాయవ‌తి గ్రీన్ సిగ్న‌ల్…

తెలంగాణ‌లో బీఆర్ఎస్‌తో పొత్తుకు బీఎస్సీ అధినేత్రి మాయావ‌తి అంగీకారం తెలిపారు. ఈ మేర‌కు బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ – బీఎస్పీల కూట‌మి చ‌ర్చ‌ల‌పై నిన్న ఏర్ప‌డిన సందిగ్ధానికి బీఎస్పీ జాతీయ అధ్య‌క్షురాలు మాయావ‌తి కొద్దిసేప‌టి క్రిత‌మే తెర‌దించిన‌ట్లు ప్ర‌వీణ్ కుమార్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ కూట‌మిలో లేనందున‌, బీఎస్పీకి ఆ పార్టీతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో క‌లిసి ప‌ని చేయ‌డానికి మాయావ‌తి అంగీక‌రించార‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు విష‌యంలో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో జ‌రిగే తదుప‌రి స‌మావేశానికి బీఎస్పీ ఎంపీ రాంజీ.. బెహ‌న్ జీ దూత‌గా హాజ‌రు కానున్నట్లు ఆర్ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement