Wednesday, May 1, 2024

సృజనాత్మకతను వెలికి తీస్తే అద్భుతాలు – ప్రొఫెసర్ ఎం రాములు

హైద‌రాబాద్ – విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తే అద్భుతాలు సృష్టించగలరని ఉస్మానియ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎం రాములు అన్నారు. శుక్రవారం అబిడ్స్ లోని ఆరోరా కాలేజీలో నిర్వహించిన అభివ్యక్తి 2023 టెక్నో మేనేజ్మెంట్ కార్నివాల్ ను కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ దేవేందర్, యునైటెడ్ హెల్త్ గ్రూప్ ఫైనాన్స్ అడ్వైజర్ వినోద్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ఆధ్యాపకుల విధి అని అన్నారు.

ఇష్టమైన కోర్సులను ఎంచుకొని చదువులు కొనసాగిస్తున్న విద్యార్థుల ఆసక్తిని గుర్తించి ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తే గొప్ప విజయాలు సాధిస్తారని అన్నారు. నానాటికి అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సొంతం చేసుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్నివాల్ లో తొలి రోజు వివిధ కళాశాలల విద్యార్థులకు బిజినెస్ క్విజ్, డీ బగ్గింగ్, ప్రాజెక్టు ప్రకల్ప్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రదేశ్ చంద్ర పట్నాయక్, అధ్యాపకులు ఎస్ విజయ, దీపిక, ఆరిఫా బేగం, అనుదీప్, సుష్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement