Sunday, December 8, 2024

TS : నకిలీ సాస్ తయారు…. ముఠా గుట్టు రట్టు…

ఇటీవ‌ల కాలంలో న‌కిలీ ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ మార్కెట్‌లో విక్ర‌యాలు ఎక్కువ‌గా అవుతున్నాయి. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుకుంటూ సోమ్ముచేసుకుంటున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వాటికి నకిలీ తయారు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లో నకిలీ సాస్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

- Advertisement -

ప్రాణాంతకమైన రసాయనాలతో ఓ ముఠా సాస్ ను తయారు చేస్తోందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. హానికర రసాయనాలు, సింథటిక్ రంగులతో సాస్ ను ఈ ముఠా తయారు చేస్తోంది. 772 లీటర్ల కల్తీ సాస్, 30 లీటర్ల ఎసిటిక్ ఆసిడ్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ బాలాజీ ఇండస్ట్రీపై దాడి చేసి రూ. 3.50 లక్షలు విలువ చేసే కల్తీ సాస్ ను శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement