Saturday, May 4, 2024

ప్రతిభ చూపిన క్రీడాకారులు.. మెడల్స్ అందించిన అధికారులు..

మక్తల్ (ప్రభన్యూస్): క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచిన 30 మంది క్రీడాకారులకు మంగళవారం టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెడల్స్ ప్రధానం చేశారు తెలంగాణ రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ ఆదేశాల మేరకు నారాయణపేట అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 1న మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్లో 17 సంవత్సరాల లోపు బాలబాలికలకు టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో జిల్లా నలుమూలల నుండి 200 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో క్రీడా నైపుణ్యతను ప్రదర్శించిన 30 మంది బాలబాలికలకు ప్రోత్సాహకంగా మెడల్స్ అందజేశారు.

అలాగే జాతీయస్థాయి క్రీడలకు నారాయణ పేట గురుకుల బాలికల జూనియర్ కాలేజ్ కు చెందిన శ్రీలక్ష్మీ,ఊట్కూర్ గురుకుల జూనియర్ కాలేజ్ ఎస్.శిరీష, కేరళ పబ్లిక్ హై స్కూల్ మక్తల్ కు చెందిన స్నేహ , బాలుర విభాగంలో ఈసారి మురారి , బొంబాయి అనిల్ 17 సంవత్సరాల లోపు విభాగంలో ఎంపికైనట్లు టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి.గోపాలం తెలిపారు. వీరంతా ఈ నెల 21 నుండి 25 వరకు మహారాష్ట్ర లోని పాల్ గారు పట్టణంలో జరుగనున్న జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటారని అధ్యక్షుడు తెలిపారు .

అదేవిధంగా 15 సంవత్సరాల లోపు బాలికల విభాగము కావ్య శ్రీ ఈనెల ఈనెల 14 నుండి 17 వరకు రాజస్థాన్ నాగూర్ పట్టణంలో జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు . ఈ ఎంపికలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొడంగల రఘు ప్రసన్న భట్ , ఉపాధ్యక్షులు బి. శ్రీనివాసులు, తాన్ సింగ్ ,ప్రధాన కార్యదర్శి అమ్రేష్, నిర్వహణ కార్యదర్శి దామోదర్, రూప ,అబ్దుల్ రావు, కాంత్ కుమార్, పి ఈ టి లు మంజుల, అంబు బాయి , రాజేశ్వరి శ్రీలత స్వప్న అశ్విని రామకృష్ణ ,మణికంఠ ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement