Wednesday, May 1, 2024

MBNR: మంత్రి, ఎమ్మెల్యే ప్రా‌రంభించిన శిలాఫలకం.. గంటల వ్యవధిలోనే తొలిగింపు

అలంపూర్ ఇంచార్జి, జులై 28 (ప్రభ న్యూస్) : 33/11 కేవీ సబ్ స్టేషన్ ను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే వి.యం అబ్రహం శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభించిన గంటల వ్యవధిలోనే విద్యుత్ అధికారులు శిలాఫలకం తొలిగించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలోని ఉప్పల్ గ్రామంలో చోటుచేసుకుంది.


ఈవిషయంపై ఉప్పల్ సర్పంచ్ ఎన్.జయంతి, ఎంపీటీసీ ప్రహ్లాదరెడ్డిని ఆంద్రప్రభ వివరణ కోరగా.. ఈ సబ్ స్టేషన్ గతంలోనే ఓపెనింగ్ జరిగిందని, ఇప్పుడు రీఓపెనింగ్ చేస్తున్నారన్నారు. ఇంకా పనులు మిగిలే ఉన్నాయన్నారు. 33/11కేవీ సబ్ స్టేషన్ ప్రారంభం వాయిదా పడిందని, రాత్రి మాకు తెలిపి ఉదయాన్నే గ్రామ సర్పంచ్ కు, ఎంపీటీసీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉదయాన్నే ప్రారంభించినట్లు వారు తెలిపారు. తమకు సమాచారం లేనప్పుడు, ఆ శిలాఫలకంలో తమ పేర్లు తొలగించాలని సర్పంచ్ ఎన్ జయంతి, ఎంపీటీసీ ప్రహ్లదరెడ్డి విద్యుత్ అధికారులను కోరగా.. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించిన గంటల వ్యవదిలోనే శిలాఫలకాన్ని తొలిగించడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ప్రారంభించడంపై ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement