Friday, May 17, 2024

నాబడి కోసం మొబైల్‌ యాప్..

మహబూబ్‌నగర్‌ : మీరు చదువకున్న బడిని బాగు చేయదలుచుకున్నారా.. మీరు చదువుకున్న బడి అంటే మీకు ఇష్టమా .. అయితే బడి బాగు కోసం మీ వంతు సహకారం అందించండి. చదువుకున్న బడి రుణం తీర్చుకోండి . ఇందుకు నాబడి కోసం మొబైల్‌ యాప్‌ సిద్దంగా ఉంది అని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు. జిల్లా విద్యాశాఖ , ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన నా బడి కోసం నా మొబైల్‌ యాప్‌ ను కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఇంటింటికి వంద బడికి చంద కార్యక్రమం మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు నా బడి కోసం మొబైల్‌ యాప్‌ ను ప్రారంభించినట్లు కలెక్టర్‌ తెలిపారు. పూర్వ విద్యార్థులు , విదేవాలు , పట్టణాలు , నగరాల్లో ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు , వారు చదివిన పాఠశాల బాగు కోసం ఏదైనా విరాళాలను ఇవ్వదలిస్తే నాబడి కోసం మొబైల్‌ యాప్‌ ద్వార వారు ఉన్న చోటి నుండి విరాళాలను ఇవ్వవచ్చని తెలిపారు. ఇలా వచ్చిన విరాళాలతో పాఠశాలల కోసం ప్రత్యేకించి పాఠశాలల్లో పారిశుద్ద్యం , మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరుగుతుందని , విద్యార్థులకు శానిటైజర్లు , మాస్కులు వంటివి తప్పనిసరి అవసరం అవుతాయని , అంతేకాక విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్వ విద్యార్థులు ఇచ్చే ఆర్థిక సహకారం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పాఠశాలలు పున: ప్రారంభం అయిన తరువాత మొదటి ప్రాధాన్యత శానిటైజర్‌ , మాస్కులు , కుర్చీలు , బెంచీలతో , పాటు ఇతర సౌకర్యాలకు ఉపయోగకరంగా ఉండేలా ఈ విరాళాలు ఉపయోగపడతాయని చెప్పారు. యాప్‌ను తీసుకురావడంలో కృషి చేసిన జిల్లా ఇన్ఫర్మేటిక్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ మూర్తి , రాష్ట్ర స్థాయి అధికారి శివాజీ , తదితరులను జిల్లా కలెక్టర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి , ఈ జిల్లా మేనేజర్‌ చంద్రశేఖర్‌ , నరేష్‌ , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement