Friday, May 3, 2024

చిరుత పులుల కలకలం

అడ‌వుల నుంచి దారిత‌ప్పి చిరుత పులులు జ‌నావాసాల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో జ‌నం భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో పెద్ద‌పులులు సంచ‌రిస్తున్న‌ట్లు అధికారులు ఆన‌వాళ్ల‌ను గుర్తించారు. చిరుత పులులు కూడా సంచ‌రిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు మ‌రింత టెన్ష‌న్ కు గుర‌వుతున్నారు. తాజాగా నారాయణపేట జిల్లాలోని కోస్గిలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. కోస్గి సమీపంలో ఉన్న గుట్టపై రెండు చిరుత పులులు మకాం వేశాయి. గ్రామంలోని కుక్కలు, గొర్రెలను చంపేస్తున్నాయి. గ్రామంలో పులులు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. చిరుతల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement