Friday, April 26, 2024

కొనుగోలు కేంద్రాలలోనే మద్దతు ధర..

వీపనగండ్ల : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకొని మద్దతు ధర పొందాలని ఎంపీపీ కమలేశ్వర్ రావు కోరారు. మండల పరిధిలోని కొర్లకుంటలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపిపి కమల్లేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి, కొర్లగుంట గ్రామ సర్పంచ్ నారాయణ, మహిళా సమైక్య ఏపిఎం చంద్రకళ,రాజక్,గోపి,రవిందర్ రెడ్డి,కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement