Monday, April 29, 2024

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సాధకుడు భవిష్యత్ తెలంగాణ దీక్షిత్ కేసీఆర్ బ‌ర్త్ డేను జరుపుకోవడం ఆనందంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో గల కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రమే మన బతుకులకు మోక్షమని ఊరూర కదిలించి ఉద్యమాన్ని ఉరికించి రాజీ లేని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన భోజనం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని రణం నుండి తప్పుకుంటే రాళ్లు ఇసిరి కొట్టమని ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి ప్రజలను కదిలించిన నిజమైన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత.. మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement