Wednesday, May 1, 2024

గ్రామ పంచాయితీ కార్మికులకు పిఆర్సీ ..

కల్వకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు పిఆర్సీని అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు తెలిపారు. గ్రామ పంచాయితీ కార్మికులు స్థితిగతులపై గ్రామాల పర్యటన కార్యక్రమంలో భాగంగా మండలంలోని రఘుపతిపేట గ్రామంలో పారిశుద్ద్య కార్మికులతో ఆంజనేయులు మాట్లాడి సమస్యలు అడిగితెలుసుకున్నారు. గ్రామాల అభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న కార్మికులకు పిఆర్సి అమలు చేసి వారిని అదుకొవాలని డిమాండ్‌ చేశారు. అదెవిధంగా వారికి మాస్క్‌లు, గ్లౌజులు ఇవ్వడంలేదని అన్నారు. కార్మికులకు నెలకు 4రోజులు సెలవులు ఇవ్వాలని ఆంజనేయులు ప్రభుత్వన్ని కొరారు. కార్మికులకు ఇచ్చె వేతనం గత 4నెలలనుండి బకాయిలు ఉన్నాయని తెలిపారు. కార్మికులకు వెంటనే ప్రభుత్వం బకాయిలను చెల్లించాలన్నారు. లేని యెడల కార్మికులతో కలిసి అందోళన చేస్తామని ఆంజనేయులు హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement